News September 15, 2024

పాఠాలు మీరు చెబుతారా జగన్?: మంత్రి సత్యకుమార్

image

AP: YS జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ‘నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది కొన్ని కాలేజీలు ప్రారంభించారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు లేవు. పులివెందుల కాలేజీలో 48శాతం బోధనా సిబ్బంది లేరు. గదులు లేవు. విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలి? పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెబుతారా ప్రొఫెసర్ జగన్’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

Similar News

News September 18, 2024

MPగానే పెళ్లి చేసుకుంటా: కంగనా రనౌత్

image

సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఎంపీగా పదవిలో ఉండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడి దయ వల్ల అది జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 38 ఏళ్ల కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

News September 18, 2024

IND vs BAN: రేపటి నుంచే తొలి టెస్టు

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి టెస్టు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులోనే భారత్‌పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.

News September 18, 2024

కొత్త పంజాబ్‌ను చూపిస్తా: పాంటింగ్

image

వచ్చే సీజన్‌లో సరికొత్త పంజాబ్ కింగ్స్ టీమ్‌ను చూపేందుకు ప్రయత్నిస్తానని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ‘పంజాబ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ‘పాంటింగ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా జట్టును పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఆయన శ్రమిస్తారని ఆశిస్తున్నాం’ అని పంజాబ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.