News June 14, 2024

తప్పు చేసిన అధికారులను వదలం: బుచ్చయ్య చౌదరి

image

AP: గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన ఏ ఒక్క అధికారిని వదలమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘వైసీపీ సర్కార్ ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతలను హీనంగా చూసింది. అటు అధికారులు కూడా కనీసం ప్రొటోకాల్ పాటించలేదు. అధికార పక్షానికి వత్తాసు పలికారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News November 24, 2025

ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల లేఖ

image

ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ MH, MP, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు మావోయిస్టు ప్రతినిధి పేరిట లేఖ రాశారు. ‘పోరాటం నిలిపివేయాలన్న కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నాం. ఆయుధాలు విడిచి ప్రభుత్వ పునరావాసం పొందాలనుకుంటున్నాం. అయితే సమష్టి నిర్ణయానికి రావడానికి మాకు 15 FEB 2026 వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం. దీని వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదు’ అని తెలిపారు.

News November 24, 2025

టమాటా కేజీ రూ.80!

image

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

News November 24, 2025

తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

image

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.