News October 17, 2024

6Gలో భారత్‌ అగ్రగామిగా నిలిచేలా..!

image

IIT మద్రాస్‌ టెలికమ్యూనికేషన్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్‌తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్‌ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.

Similar News

News October 17, 2024

34కే 6 వికెట్లు.. నలుగురు డకౌట్

image

NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

News October 17, 2024

హిందీ గడ్డపై సత్తా చాటిన ‘సలార్’

image

ప్రభాస్ నటించిన సలార్-1 మూవీ హిందీ వెర్షన్ మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తరాదిన టీవీ ప్రీమియర్స్‌లో 30 మిలియన్ల వ్యూస్ సాధించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వ్యూస్ పొందిన టాప్-3 చిత్రాల జాబితాలో చేరింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘స్టార్ గోల్డ్’ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే 2023 నుంచి అత్యధిక రేటింగ్ పొందిన డబ్బింగ్ మూవీగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.

News October 17, 2024

అన్నాడీఏంకేకు పవన్ కళ్యాణ్‌ శుభాకాంక్షలు

image

అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.