News November 10, 2024
మా జిల్లాను అభివృద్ధి చేసుకోనివ్వండి: సీఎం రేవంత్

పాలమూరు జిల్లాకు నిధుల వరద పారిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘నా జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. KCRను పార్లమెంట్‌కు పంపింది ఇక్కడి ప్రజలే. కానీ ఇక్కడి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంటే మేం అడ్డుపడలేదు. KCR పాలనలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు. త్వరలో మక్తల్-NRPT ప్రాజెక్టు చేపడతాం’ అని అమ్మాపురం సభలో ప్రకటించారు.
Similar News
News January 12, 2026
ఈకల రంగును బట్టి కోళ్ల జాతిని గుర్తిస్తారు

ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలుంటే “కాకి”, తెల్లని ఈకలుంటే “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే “పర్ల”, ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే ‘డేగ’ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని, ఈకలు లేత బంగారు రంగులో ఉంటే ‘అబ్రాసు’ అంటారు.
News January 12, 2026
నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి: మంత్రి ఉత్తమ్

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. <<18806199>>టన్నెల్ బోరింగ్ మెషీన్<<>>ను తొలగించిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో (DBM) పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లిస్తామని నిర్మాణ సంస్థకు హామీ ఇచ్చారు.
News January 12, 2026
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 132 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


