News April 25, 2024
మనిద్దరం కలిసి డాన్స్ చేద్దాం.. షారుఖ్తో మోహన్ లాల్

షారుఖ్ నటించిన జవాన్ మూవీలోని ‘జిందా బందా’ పాటకు మోహన్ లాల్ ఓ ఈవెంట్లో డాన్స్ చేశారు. దీనికి బాలీవుడ్ బాద్షా స్పందిస్తూ.. ‘ఈ పాటకు స్టెప్పులు వేసి దాన్ని ప్రత్యేకంగా నిలిపిన మోహన్ లాల్కు థాంక్స్. మీతో డిన్నర్ చేసేందుకు వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ‘కేవలం డిన్నరేనా? ఆ పాటకు మనమెందుకు డాన్స్ చేయకూడదు?’ అని కంప్లీట్ యాక్టర్ ప్రశ్నించారు. దీనికి ఓకే సార్ అంటూ షారుఖ్ రిప్లై ఇచ్చారు.
Similar News
News September 16, 2025
దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఉత్సవాలు: సత్యకుమార్

AP: దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో VJAలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘22వ తేదీ నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. VJAను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.
News September 16, 2025
రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.
News September 16, 2025
JAN నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు: CBN

AP: రాష్ట్రంలో రేపటి నుంచి OCT 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపట్టాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయటం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో CC రోడ్లున్నా డ్రెయిన్లు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలి. గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. జనవరి నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు’ అని కలెక్టర్లకు సూచించారు.