News October 26, 2024
AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

ట్రెండింగ్లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.
Similar News
News January 9, 2026
పేపర్ లీక్ కలకలం.. నలుగురు సస్పెండ్

TG: జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. గత నెలలో జరిగిన BSc థర్డియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీలో వీసీ జానయ్య సందర్శన సందర్భంగా ఈ విషయం బయటపడింది. దీంతో వారి అడ్మిషన్లు రద్దు చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరగనుంది.
News January 9, 2026
లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

తమ బ్యాంకులో లోన్లు తీసుకున్న వారికి HDFC గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల RBI రెపో రేట్ను తగ్గించడంతో లోన్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో లోన్ల కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు 8.25శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉండనుంది. దీంతో తర్వాతి EMIలు కాస్త తగ్గనున్నాయి. ఇది ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ పేర్కొంది. తగ్గిన వడ్డీ రేట్లను పైన ఫొటోలో చూడవచ్చు.
News January 9, 2026
పుట్టుకతో కుబేర యోగం ఎలా కలుగుతుంది?

జాతక చక్రంలో ధన స్థానమైన 2వ ఇల్లు, లాభ స్థానమైన 11వ ఇల్లు చాలా కీలకం. ఈ 2 స్థానాల అధిపతులు తమ స్వక్షేత్రాల్లో లేదా ఉచ్ఛ స్థితిలో ఉండి, ఒకరినొకరు వీక్షించుకున్నా లేదా కలిసి ఉన్నా కుబేర యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గురు, శుక్ర గ్రహాల అనుకూలత ఈ యోగానికి బలాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉండి ఎనిమిది, పన్నెండో స్థానాలతో శుభ సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడి వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది.


