News July 18, 2024
రాహుల్ గాంధీని సన్మానిద్దాం: CM రేవంత్

TG: రైతులకు పంట రుణ మాఫీ చేసిన శుభ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని త్వరలో సన్మానిద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీకి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్‌ను సన్మానించేందుకు ఈ నెలాఖరున వరంగల్‌లో భారీ సభ నిర్వహిద్దామని, దానికి లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 2, 2026
ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

రాత్రిళ్లు 7-8 గంటలు నిద్రపోయినా చాలామందికి ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం గాఢ నిద్ర లేకపోవడమే అంటున్నారు నిపుణులు. దీనికి బ్లూ లైట్, కెఫీన్, స్వీట్స్, అస్తవ్యస్తంగా ఉన్న నిద్రవేళలు, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి నిద్ర సమస్యలు, థైరాయిడ్ సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరును కలిసి వారి సూచనలను పాటించాలని చెబుతున్నారు.
News April 2, 2026
ఇకపై రాజధాని అమరావతి అజేయం: పవన్

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడం శుభపరిణామం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఇకపై రాజధాని అమరావతి అజేయం. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచి పెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని ఉండటమే ఇష్టం లేని వారు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలెవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి’ అని ట్వీట్ చేశారు.
News April 2, 2026
పెరిగిన ఎండలు.. అరటి రైతులకు సూచనలు

అరటి చెట్లకు ఎండ నుంచి రక్షణకు వాటి పాదుల్లో జనుము, జీలుగ, అలసంద, ఆనప, గోరుచిక్కుడు వంటి వాటిలో ఏవైనా విత్తనాలను వేయాలి. వీటి నుంచి వచ్చే మొక్కలతో నేల వేడెక్కడం తగ్గి అరటి చెట్లకు మేలు జరుగుతుంది. చిన్న అరటి మొక్కలకు ఇరువైపులా ఈత ఆకులను అమర్చడం వల్ల వీటిపై ఎండ ప్రభావం తగ్గుతుంది. నీటి డ్రిప్ పైపును మొక్కకు దగ్గరగా పెట్టకుండా కొంచెం ఎడంగా పెట్టడం వల్ల, వేరుకుళ్లు తెగులు ముప్పు తగ్గుతుంది.


