News June 28, 2024
వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోం: సోము వీర్రాజు

AP: వైసీపీ MPలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి పార్టీలో చేరుతారన్న ప్రతిపాదన గాని, ఆలోచన కానీ లేదన్నారు. EVMలపై అనుమానాలున్నాయని YCP నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు.
Similar News
News December 9, 2025
వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


