News March 17, 2025
సిల్లీ ఆస్కార్లను వాళ్ల దగ్గరే ఉంచుకోమనండి: కంగన

కంగన ఇందిరాగాంధీ పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’కి OTTలో మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఆ సినిమాను ఆస్కార్లకు పంపించాలని, కచ్చితంగా అవార్డులు గెలుచుకుంటుందని ఓ అభిమాని ట్వీట్ చేయగా కంగన స్పందించారు. ‘తన అసలు ముఖాన్ని చూపించినా, ఇతరులపై చేసే అణచివేతను గుర్తుచేసినా అమెరికా తట్టుకోలేదు. సిల్లీ ఆస్కార్లను వారి దగ్గరే ఉంచుకోమనండి. మనకు మన జాతీయ పురస్కారాలున్నాయి’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 17, 2025
డీలిమిటేషన్పై అఖిల పక్ష సమావేశం

TG: డీలిమిటేషన్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ అంశంపై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్పై తమిళనాడులో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుందని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరవుతారని చెప్పారు.
News March 17, 2025
CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా MLC నాగబాబుకు మంత్రి పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.