News April 10, 2024
పవన్ కళ్యాణ్‌ను సీఎం చేద్దాం: భారత మాజీ క్రికెటర్

AP: సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్‌పై క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టత ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్దాం’ అని ట్వీట్ చేశారు. కాగా తొలుత వైసీపీలో చేరిన అంబటి.. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ పార్టీని వీడి జనసేన అధినేతను కలిశారు. ఆ తర్వాత సిద్ధం అని ట్వీట్ చేయడంతో తిరిగి వైసీపీ గూటికి వెళ్తారనే ప్రచారం జరగ్గా.. తన ట్వీట్‌తో రాయుడు క్లారిటీ ఇచ్చారు.
Similar News
News March 4, 2026
దివ్యాంగులకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం.. TG ప్రభుత్వం క్లారిటీ

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో TGSRTC బస్సుల్లోనూ దివ్యాంగులందరికీ పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని TG ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందని తెలిపింది.
News March 4, 2026
₹17 లక్షల డ్రోన్ కోసం ₹33 కోట్ల మిస్సైల్: ఇరాన్ ‘కాస్ట్ వార్’ వ్యూహం!

సుమారు ₹17 లక్షల విలువైన ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ₹33 కోట్ల విలువైన పేట్రియాట్ మిస్సైళ్లను వాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహంతో అమెరికా రక్షణ నిల్వలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ వంటి దేశాల వద్ద మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయుధాలు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయన్నదే ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించనుంది.
News March 4, 2026
చిరంజీవి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరు స్టైలిష్‌గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.


