News July 3, 2024
రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: భట్టి

TG: ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రెస్మీట్లో స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. గత ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.
Similar News
News October 22, 2025
భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.
News October 22, 2025
TTD: 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి.
News October 22, 2025
పేల సమస్యకు ఈ డివైజ్తో చెక్

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.