News July 18, 2024

ఏపీ రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం: షర్మిల

image

AP: పల్నాడు(D) వినుకొండలో జరిగిన హత్య ఘటన అత్యంత దారుణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘నడిరోడ్డుపై ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు. ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్థుడిని కఠినంగా శిక్షించాలి. రాజకీయ హత్య అయితే కూటమి ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీటికి అడ్డుకట్ట వేస్తారా? లేదా? రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.

News November 21, 2025

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

image

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్‌ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.

News November 21, 2025

7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

image

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్‌డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.