News March 26, 2024

మోదీని ఇంటికి పంపేవరకు నిద్రపోం: ఉదయనిధి

image

మోదీ, BJPని ఇంటికి పంపేవరకూ నిద్రపోయేది లేదని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. DMKకి నిద్రలేని రాత్రులు వచ్చాయని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘గ్యాస్ సిలిండర్ 2014లో రూ.450 ఉంటే మీరు రూ.1,200 చేశారు. ఎన్నికలు రాగానే రూ.100 తగ్గించి డ్రామాలాడుతున్నారు. ఎన్నికలు ముగిస్తే సిలిండర్లపై మళ్లీ రూ.500 పెంచుతారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Similar News

News March 17, 2026

డిప్రెషన్‌ కూడా గుండెపోటుకు కారణమే!

image

గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో.. డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.

News March 17, 2026

డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

image

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.

News March 17, 2026

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన!

image

LPG వినియోగదారుల్లో eKYCపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు eKYC పూర్తి చేయనివారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8, 9వ రీఫిల్స్‌పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు’ అని పేర్కొంది.