News May 10, 2024
శ్రీరాముడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: బీజేపీ ఎమ్మెల్యే

TG: రోడ్‌షోలో కేటీఆర్‌పై దాడి <<13216588>>ఘటనపై<<>> బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. ‘శ్రీరాముడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. ఓడినా గెలిచినా దేశం కోసం పనిచేస్తాం. హిందువులను అవమానించేవారిని దేశం నుంచి బహిష్కరించే రోజులు వస్తాయి’ అని ఆయన హెచ్చరించారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు దిగింది.
Similar News
News December 9, 2025
‘అఖండ-2’ రిలీజ్‌తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?
News December 9, 2025
సీఎం రేవంత్‌పై చిరంజీవి ప్రశంసలు

TG: అన్ని రంగాలను ఒకే వేదికపైకి తెచ్చి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం CM రేవంత్‌కే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంత గొప్ప సభకు తననూ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమన్నారు. HYDను వరల్డ్ సినీ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.


