News November 27, 2024
కులగణన డేటాను పబ్లిక్ డొమైన్లో పెడతాం: పొన్నం
TG: పారదర్శకంగా కులగణన చేపడుతున్నామని, అది పూర్తికాగానే డేటాను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన దేశానికి దిక్సూచిగా నిలవబోతోందని పొన్నం అన్నారు.
Similar News
News November 27, 2024
అదానీ కాకుంటే జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ఎవరిచ్చినట్టు?
YS జగన్‌కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధులు భారత అధికారులకు లంచమిచ్చినట్టు US కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, CDPQ ప్రతినిధులపైనే ఉన్నాయంది. మరి జగన్ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్టు?
News November 27, 2024
కలియుగ దానకర్ణుడు.. వారెన్ బఫెట్ రూ.9300 కోట్ల విరాళం
వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్లో భాగంగా ఆయన ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లు వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై బెర్క్‌షైర్ హాత్వే వాటాదార్లకు లేఖ రాశారు. అత్యంత సంపన్నుడైన బఫెట్ ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటూ, సాధారణ కార్లలో ప్రయాణిస్తారు.
News November 27, 2024
పాల ఉత్పత్తిలో భారత్ టాప్.. తొలి 5 రాష్ట్రాలివే!
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ నం.1గా నిలిచింది. 2022-23లో 23.58 కోట్ల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2023-24లో 23.93 కోట్ల టన్నులకు చేరింది. గడిచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 2% పెరుగుదల కనిపించగా భారత్‌లో 6% వృద్ధి ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గేదెల నుంచి ఉత్పత్తి 16% తగ్గినా దేశవాళీ ఆవుల నుంచి 44.76% పెరిగింది. దేశంలో UP, రాజస్థాన్, MP, గుజరాత్, MH అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నాయి.