News October 7, 2025

బ్లాక్ సర్కిల్స్ ఇలా తగ్గిద్దాం..

image

కంప్యూటర్లు, ఫోన్ ఎక్కువగా చూడటం, వేళకు నిద్రపోకపోవడం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటిచారలు వస్తాయి. వీటిని కొన్ని ఇంటిచిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంప రసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K బ్లాక్‌సర్కిల్స్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్లచుట్టూ రాసి మర్దన చేయాలి. <<-se>>#BeautyTips<<>>

Similar News

News October 7, 2025

వాల్మీకి గురించి మనకు తెలియని మరో కథ

image

ఓ బోయవాడు క్రౌంచపక్షి జంటలో ఒకదాన్ని చంపడం చూసి వాల్మీకి చలించిపోతాడు. అసంకల్పితంగా ఓ శ్లోకాన్ని పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై.. ఆ శ్లోకమే రామాయణానికి మూలం అవుతుందని చెబుతాడు. పాత్రల సంభాషణలు, మనోగతాలు స్పష్టంగా తెలుసుకునే వరం ఇస్తాడు. ఆ వరం మేరకు వాల్మీకి ధ్యానంలో కూర్చొంటాడు. ఎలాంటి కల్పితం లేకుండా 24K శ్లోకాలతో మహాకావ్యాన్ని రచించి, లోకానికి ఆదికావ్యాన్ని అందించాడు. నేడు ఆయన జయంతి.

News October 7, 2025

PM మోదీ ఆసక్తికర పోస్ట్

image

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.

News October 7, 2025

ప్రైవేటు ఉద్యోగులకు ‘రైట్ టు డిస్కనెక్ట్’ కావాల్సిందేనా?

image

గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్-2025లో 42వ స్థానంలో ఉన్న భారత్‌లో ఉద్యోగుల పని భారం చర్చనీయాంశమైంది. దీనికి పరిష్కారంగా కుటుంబంతో ఉన్నప్పుడు వర్క్ కాల్స్, మీటింగ్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండేందుకు వీలు కల్పించే ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లును కేరళ ఎమ్మెల్యే జయరాజ్ ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇలాంటి బిల్లును తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?