News October 28, 2024

‘కూటమి’ డైవర్షన్ పాలిటిక్స్‌ను తిప్పికొడదాం: వైసీపీ

image

AP: కూటమి ప్రభుత్వం 5 నెలలుగా ఒక్క కొత్త పథకమూ అమలు చేయలేదని వైసీపీ విమర్శించింది. ‘ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ‘జూన్‌లో రుషికొండ భవనాలు, జులైలో శ్వేతపత్రాలు, AUGలో ముంబై నటి, SEPలో ప్రకాశం బ్యారేజీలో బోట్లు, శ్రీవారి లడ్డు, OCTలో YSR కుటుంబంపై విషప్రచారాలు చేసింది. వీటిని తిప్పికొడుతూ ప్రభుత్వ నయవంచనలను నిలదీయాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

Similar News

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.

News December 1, 2025

ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

image

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>