News March 30, 2024
ఫేక్ ప్రచారాలను ఇలా అడ్డుకుందాం

Way2News పేరుతో కొందరు అసత్య ప్రచారాలు వైరల్ చేస్తున్నారు. మా లోగోతో వచ్చే వార్తలు నిజంగా మా నుంచి పబ్లిష్ అయ్యాయా? లేదా సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి ఆర్టికల్కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. మీకు వచ్చిన స్క్రీన్షాట్పై కోడ్ను యాప్లో లేదా fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఆర్టికల్ చూపించాలి. వేరే ఆర్టికల్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా ఆ ఫార్వర్డ్ మాది కాదు. వీటిని grievance@way2news.comకు పంపవచ్చు.
Similar News
News January 21, 2026
మేడారం: ఇంతకీ సమ్మక్క- సారలమ్మను చంపిందెవరూ?

సమ్మక్క-సారలమ్మను కాకతీయులు చంపారంటూ మేడారం జాతర-2026 ఆహ్వాన పత్రికల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కాకతీయులపై అపనిందలు ఏంటనీ తన ఫేస్బుక్ ఖాతాలో తాజాగా సమాచారశాఖ డీడీ వెంకటరమణ తన వాదనను వినిపించారు. బాంబే ప్రావిన్సులోని మేడారం రాజ్యంపై క్రీ.శ.1309లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయిన కాఫర్ మాలిక్ దండయాత్ర చేసి హతమార్చాడనేదీ వాస్తవ చరిత్రంటూ చరిత్రకారులు అంటున్నారు. మరి ఏది నిజం?
News January 21, 2026
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23న సామూహిక అక్షరాభ్యాసం

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం శ్రీ పంచమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు, యాగశాలలో సరస్వతి యాగం నిర్వహించనున్నారు.
News January 21, 2026
నేటి ముఖ్యాంశాలు

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం


