News April 26, 2024
ఫేక్ న్యూస్‌ను కట్టడి చేద్దాం

Way2News పేరుతో కొందరు చేసే అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండండి. ఈ ఫేక్ న్యూస్ గుర్తించడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీకు వచ్చే స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో సేమ్ ఆర్టికల్ వస్తే అది మేము పబ్లిష్ చేసిన వార్త. వేరే కంటెంట్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా అది మా లోగో వాడి రూపొందించిన ఫేక్ న్యూస్. వీటిని grievance@way2news.comకు పంపండి.
Similar News
News January 16, 2026
2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2026
టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.
News January 16, 2026
రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.


