News November 5, 2024
యురేనియం అంశాన్ని CM దృష్టికి తీసుకెళ్తాం: నిమ్మల

AP: కర్నూలు(D) కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలపై కొనసాగుతున్న ఆందోళనలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో జరగబోయే సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు నిమ్మల పిలుపునిచ్చారు.
Similar News
News November 24, 2025
WGL: జల వనరుల సర్వేలు: సీపీవోలే కన్వీనర్లు

వరంగల్లో జల వనరుల గణనలో భాగంగా, గ్రామాల్లోని చెరువుల నుంచి చిన్న చేదబావుల వరకు ప్రతీ నీటి వనరును సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. ప్రతి వనరుకు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ సర్వేకు సీపీవోలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాబేస్ను సిద్ధం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యం.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


