News August 20, 2024

ఇవాళ ప్రత్యేక విషయం చెబుతా: సమంత

image

హీరోయిన్ సమంత ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర పోస్టు చేశారు. ‘ఈ రోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను. ఎదురుచూడండి’ అని రాసుకొచ్చారు. ఆమె దేనిగురించి చెబుతారోననే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. లైఫ్ ప్లాన్స్ లేదా తన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా? తన కొత్త మూవీ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా? అని చర్చించుకుంటున్నారు. ఇటీవల ఆమె మాజీ భర్త నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News January 17, 2026

మేడారం జాతర.. ఆర్టీసీ ఛార్జీల వివరాలివే

image

TG: మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే RTC ఎక్స్‌ప్రెస్ బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు ప్రకటించారు. గోదావరిఖని నుంచి ₹400, హుజూరాబాద్ ₹320, హుస్నాబాద్ ₹350, కరీంనగర్ ₹390, పెద్దపల్లి ₹420, మంథని ₹350, కొత్తగూడెం ₹350, భద్రాచలం- ₹300, మణుగూరు ₹210, ఏటూరునాగారం ₹80, మంగపేట ₹110, పాల్వంచ ₹310, ఖమ్మం ₹480, కాళేశ్వరం ₹360, బెల్లంపల్లి ₹520, ఆసిఫాబాద్ నుంచి ₹590గా ఖరారు చేశారు.

News January 17, 2026

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.

News January 17, 2026

సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

image

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.