News May 20, 2024
జూన్ 4 తర్వాత మాట్లాడుదాం: పెద్దిరెడ్డి

AP: వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. నారా లోకేశ్ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూన్ 4న ఫలితాల తర్వాత అన్ని మాట్లాడుదాం అని అన్నారు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Similar News
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల పాల్గొన్నారు.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 26, 2025
రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.


