News May 12, 2024

సగర్వంగా ఓటేద్దాం: ఈసీ

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.

Similar News

News January 6, 2025

నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని వేసిన బెయిల్ ముందస్తు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన ఫ్యామిలీకి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉండగా, ఆయన భార్య‌కు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది.

News January 6, 2025

చట్టాలు మార్చాల్సిన టైమ్ వచ్చిందా?

image

కొంత మంది భార్యలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మగవాళ్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోతున్నారు. భారత చట్టాలు వారికే అనుకూలంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏ నేరం చేయకపోయినా ఎందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News January 6, 2025

భార్య టార్చర్ చేస్తోందని భర్త ఆత్మహత్య

image

భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త బలయ్యాడు. గుజరాత్ జమరాలకు చెందిన సురేశ్‌కు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. అతడికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య జయ తనను మానసికంగా టార్చర్ చేస్తోందని సురేశ్ ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేశాడు. తన చావుకు కారణమైనందుకు జీవితాంతం గుర్తుంచుకునేలా ఆమెకు గుణపాఠం చెప్పాలని అందులో కోరాడు. సురేశ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు జయపై కేసు నమోదు చేశారు.