News April 20, 2025

డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం: చిరంజీవి

image

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌లో జరిగిన నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 5, 2025

సినీ కార్మికుల సమ్మెను తప్పుబట్టిన విశ్వప్రసాద్

image

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్‌ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.

News August 5, 2025

ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

image

AP: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన RTC అందుబాటులోకి తేనుంది. AMVTI, ATP, CUD, NLR, GNT, VJW, RJY, KKD, VSP, KRNL, TPT డిపోల నుంచి ఇవి తిరగనున్నాయి. వీటికోసం కేంద్రం అందించే రూ.190కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. ఒక్కో స్టేషన్‌కు రూ.4కోట్లు ఖర్చవుతుందని, డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

News August 5, 2025

సోనూసూద్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు హర్షం

image

తమ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్‌గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.