News May 19, 2024

కిర్గిస్థాన్ యూనివర్సిటీలకు భారత ఎంబసీ లేఖ

image

కిర్గిస్థాన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నడుమ భారత ఎంబసీ ఆ దేశంలోని యూనివర్సిటీలకు లేఖ రాసింది. విద్యార్థులను వెంటనే భారత్‌కు పంపించాలని కోరింది. వారంతా దాడుల్లో గాయపడ్డారని.. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని పేర్కొంది. మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలిపింది. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని కోరింది.

Similar News

News January 21, 2026

దావోస్ మీట్.. చిరు సడన్ ఎంట్రీకి కారణమిదే?

image

TG: పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌(Swiz)లో CM రేవంత్ హాజరైన సదస్సులో మెగాస్టార్ చిరంజీవి సడన్‌గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు ఫ్యామిలీ వెకేషన్ మీద స్విట్జర్లాండ్ వెళ్లారని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి ఆయన హాజరైనట్లు సమాచారం. కాగా మెగాస్టార్ తిరిగి రాగానే MSVPG గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.

News January 21, 2026

వరుస షూటింగ్స్‌తో స్పీడ్ పెంచనున్న ప్రభాస్!

image

డార్లింగ్ ప్రభాస్ కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఇటలీ టూర్‌లో ఉండగా వీకెండ్‌లో ఇండియాకు రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. రాగానే ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్‌లో పాల్గొని అనంతరం ‘కల్కి-2’ షూటింగ్‌లో జాయిన్ అవుతారని పేర్కొన్నాయి. త్వరలో ఈ సినిమాల విడుదల తేదీలపై స్పష్టత వస్తుందన్నాయి. వీటి తర్వాత ‘స్పిరిట్’ తిరిగి పట్టాలెక్కుతుందని వెల్లడించాయి.

News January 21, 2026

వందే భారత్ స్లీపర్.. హాట్ కేకుల్లా టికెట్లు

image

కొత్తగా <<18880130>>అందుబాటులోకి<<>> వచ్చిన వందే భారత్ స్లీపర్ రైలుకు భారీ డిమాండ్ నెలకొంది. హౌరా(బెంగాల్)-కామాఖ్య(అస్సాం) మధ్య కొత్తగా ప్రారంభించిన సర్వీసు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నిన్న 8AMకు బుకింగ్ ఓపెన్ కాగా గంటల్లోనే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఫస్ట్ AC టికెట్లు వారం వరకు వెయిటింగ్ లిస్టు చూపిస్తుండటం గమనార్హం. ఈనెల 23 నుంచి సర్వీసులు కొనసాగనున్నాయి. టికెట్ రేట్లు రూ.2,435-3,855 మధ్య ఉన్నాయి.