News August 21, 2025
టీడీపీ ఎమ్మెల్యేను చంపేస్తామని బెదిరింపు లేఖ

AP: కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది. ఈనెల 17న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని నెల్లూరులోని ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. అక్కడ సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. దాన్ని తెరచి చూడగా ‘వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.2కోట్లు ఇవ్వాలి. లేదంటే ఆమెను చంపేస్తాం’ అని ఉంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Similar News
News March 6, 2026
నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభంకానుంది. జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రొగ్రామ్ ఉంటుంది. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాలు వంటి అంశాలపై విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈరోజు నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
News March 6, 2026
కూలిన సుఖోయ్.. ధర ఎంత ఉంటుందంటే?

సుఖోయ్ ఫైటర్ జెట్ Su-30MKI నిన్న శిక్షణ సమయంలో అస్సాంలోని జోర్హట్‌కు 60KM దూరంలో కూలినట్లు ఇండియన్ ఫోర్స్ ధ్రువీకరించింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పింది. అయితే యుద్ధ విమానం ధర ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతేడాది భారత్ 12 ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి రూ.13,500CR కేటాయించింది. దాని ప్రకారం ఒక్కో Su-30MKI రూ.1,000కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం IND వద్ద 260+ సుఖోయ్ జెట్లు ఉన్నాయి.
News March 6, 2026
బుమ్రా అందుకు అర్హుడు: సంజూ శాంసన్

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై <<19308021>>ఉత్కంఠ పోరు<<>>లో టీమ్ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మన కంట్రోల్‌లోకి తెచ్చిన బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను POTMను అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా తనే ఎక్కువ అర్హుడు. డెత్ ఓవర్లలో అసాధారణ ప్రదర్శన చేశాడు’ అని కొనియాడారు.


