News August 11, 2025
మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడంటూ అమిత్ షాకు లేఖ

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని శివసేన MP సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ‘JUL 21న రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యం తదితర పూర్తి వివరాలను నిజాయితీగా వెల్లడించాలి. కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కానీ ముందు మిమ్మల్ని అడగాలని నేను డిసైడ్ అయ్యా’ అని రాసుకొచ్చారు.
Similar News
News August 11, 2025
నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు: రాజగోపాల్ రెడ్డి

TG: తనకు మంత్రి పదవి ఇస్తామని మాటివ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు Dy.CM <<17365508>>భట్టి <<>>విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. TG సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానన్నారు.
News August 11, 2025
OFFICIAL: ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు

AP: ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ల్లోనే ఉంటుందని ప్రభుత్వం GO ఇచ్చింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఐడీ కార్డు చూపించి ప్రయాణించవచ్చంది. నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదని తెలిపింది.
News August 11, 2025
రూ.100 కోట్లు దాటిన ‘కింగ్డమ్’ కలెక్షన్లు!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని తెలిపాయి. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్-2 కూడా ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది.