News March 1, 2025

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖ

image

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

Similar News

News March 1, 2025

డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

image

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News March 1, 2025

తీవ్ర విషాదం.. ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని

image

TG: చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(D)లో జరిగింది. నర్సాపూర్‌‌కు చెందిన వైష్ణవి HYDలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఉరివేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పాలని పేరెంట్స్, టీచర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2025

సౌతాఫ్రికా ఈ సారైనా..

image

గత రెండేళ్లుగా సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు పీడకలను మిగిల్చాయి. 2023లో మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాతి ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ చేరినా భారత జట్టు చేతిలో అనూహ్యంగా పరాజయం పాలై కన్నీటిలో మునిగింది. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగే WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే ఊపులో ఉన్న ప్రోటీస్ జట్టు CT సెమీఫైనల్లో సత్తా చాటి ఫైనల్లోకి దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.

error: Content is protected !!