News September 15, 2024
LHMS సేవను ప్రజలు వినియోగించుకోవాలి: SP

జిల్లా ప్రజలు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కోసం జిల్లా పొలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని SP మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ సేవ పూర్తిగా ఉచితమన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్స్ లో ఉన్న ” LHMS AP Police” యాప్ ను డౌన్లోడ్ చేసి మీ వివరాలను ఫిల్ చేయాలన్నారు. తద్వారా సేవలు అందుతాయన్నారు.
Similar News
News January 3, 2026
దువ్వాడ అడుగు ఎటువైపు ?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 3, 2026
శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <
News January 3, 2026
మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


