News September 15, 2024

LHMS సేవను ప్రజలు వినియోగించుకోవాలి: SP

image

జిల్లా ప్రజలు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కోసం జిల్లా పొలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని SP మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ సేవ పూర్తిగా ఉచితమన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్స్ లో ఉన్న ” LHMS AP Police” యాప్ ను డౌన్లోడ్ చేసి మీ వివరాలను ఫిల్ చేయాలన్నారు. తద్వారా సేవలు అందుతాయన్నారు.

Similar News

News October 9, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

News October 9, 2024

కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి

image

కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.

News October 9, 2024

శ్రీకాకుళం: ఇసుక లోడింగ్‌కు టెండర్ల ఆహ్వానం

image

జిల్లాలో మొత్తం 6 రీచ్ల వద్ద ఇసుకను మనుషులతో తవ్వకాలు చేసి నిల్వ కేంద్రానికి తరలించి, వినియోగదారుల వాహనాలకు లోడ్ చేసేందుకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా భూగర్భ గనులశాఖ కార్యాలయం (కిమ్స్ ఆసుపత్రి వెనుక)లో ఈ నెల 11న ఉదయం 11 గంటల్లోగా సీల్డు టెండర్ల బిడ్ డాక్యుమెంట్లను స్వీకరించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.