News August 20, 2025
LHPS రాష్ట్ర కమిటీలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు

లంబాడా హక్కుల పోరాట సమితిలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్ద కొడప్గల్ మండలం విఠల్‌వాడీ తండాకు చెందిన జాదవ్ శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శిగా జుక్కల్ మండలం దోస్పల్లికి చెందిన జాదవ్ లక్ష్మణ్‌ను జాతీయ కార్యవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యవర్గం నియమించింది. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ చేతుల మీదుగా వీరు నియామక పత్రాలను అందుకున్నారు.
Similar News
News August 20, 2025
జాతీయ స్థాయి వాలీబాల్‌కు బొప్పాపూర్ విద్యార్థిని

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన డి.శృతిక జాతీయ స్థాయి అండర్-15 వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శృతిక అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని పీడీ అక్బర్ బుధవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
News August 20, 2025
ADB: గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్ఐ విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.
News August 20, 2025
అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: DEO

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ప్రేమ్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ ఉపాధ్యాయులు మ్యూచువల్, కేటగిరిలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. LEAP APP ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించాలని తెలిపారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈనెల 24 వరకు MEOలకు దరఖాస్తులు పంపాలన్నారు.