News July 9, 2024

రష్యా ఆర్మీ నుంచి భారతీయులకు విముక్తి?

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో పలువురు భారతీయులను రష్యా తన ఆర్మీలో వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోదీతో చర్చల అనంతరం తమ ఆర్మీలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి కలిగించాలని రష్యా ప్రెసిడెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. అటు ఈ యుద్ధంలో ఇప్పటికే ఇద్దరు భారతీయులు మరణించగా, భారీ జీతాలిస్తామని చెప్పి తమను ఆర్మీలో చేర్పించారని కొందరు ఆరోపిస్తున్నారు.

Similar News

News January 30, 2026

WPL: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

image

WPLలో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ యూపీ వారియర్స్‌‌పై గెలుపుతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్లలోనే ఛేదించింది. గ్రేస్ హారిస్(75), స్మృతి మంధాన(54*) చెలరేగి ఆడారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే, ఆశా శోభన తలో వికెట్ పడగొట్టారు. తాజా ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి యూపీ నిష్క్రమించింది.

News January 30, 2026

UGC కొత్త రూల్స్ ఏంటి? వివాదం ఎందుకు?(1/2)

image

విద్యాసంస్థల్లో వివక్షను ఆపడమే లక్ష్యంగా UGC కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. వర్సిటీల్లో Equal Opportunity Centre (EOC) ఏర్పాటు చేయాలి. SC, STలతో పాటు కొత్తగా OBC, EWS విద్యార్థులకూ రక్షణ కల్పించాలి. కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లోపు EOC సమావేశమవ్వాలి. 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అలాగే కొత్తగా మరికొన్ని యాక్షన్స్‌నూ Discriminationగా గుర్తిస్తూ వివక్ష నిర్వచనాన్ని మార్చారు.

News January 30, 2026

UGC కొత్త రూల్స్ ఏంటి? వివాదం ఎందుకు?(2/2)

image

SC, ST, OBCలకు జరిగేది మాత్రమే వివక్షగా గుర్తించడాన్ని జనరల్ కేటగిరీ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే నిర్వచనాన్ని మార్చడం వల్ల ప్రతిచిన్న విషయాన్నీ రాద్ధాంతం చేసి వివక్షగా పేర్కొంటారని, దీనివల్ల తప్పుడు కేసులు నమోదవుతాయని వాదిస్తున్నారు. EOCలో తమ రిప్రజెంటేషన్ లేకపోతే నిర్ణయాలు వన్ సైడెడ్‌గా ఉంటాయని వాపోతున్నారు. కొత్త రూల్స్ స్పష్టంగా లేవన్న సుప్రీం వాటి అమలుపై <<18991966>>స్టే<<>> విధించింది.