News February 3, 2025
పుస్తకాలకు బదులు వ్యక్తుల కథలు తెలుసుకునే లైబ్రరీలు!

లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.
Similar News
News December 14, 2025
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.
News December 14, 2025
యూరినరీ ఇన్కాంటినెన్స్కు ఇలా చెక్

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.


