News August 25, 2025
LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:MLA

భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య 1964 బ్రాంచ్–2, కరీంనగర్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఏజెంట్ల సమస్యలు, భవిష్యత్తు బీమా విధానాలు, ప్రజల్లో బీమా అవగాహన పెంపొందించడంలో ఏజెంట్లు పోషిస్తున్న కీలకపాత్రపై విశదీకరించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
Similar News
News August 24, 2025
మానకొండూరు ఎమ్మెల్యేను పరామర్శించిన మీనాక్షి నటరాజన్

మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
News August 24, 2025
కరీంనగర్ జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య, జాతీయ కో-ఆర్డినేటర్ కొల్లూరి మల్లేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మండల అధ్యక్షుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News August 24, 2025
మైనార్టీ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు

కరీంనగర్ విట్స్ క్యాంపస్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల(బాలురు), రేకుర్తిలోని తెలంగాణ మైనార్టీస్ గురుకుల కళాశాల(బాలికల) కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ కోర్సులకు ఉచిత శిక్షణలో భాగంగా ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు మైనార్టీ గురుకులాల సమన్వయకర్త కే.నరేష్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనునట్లు తెలిపారు.