News January 7, 2026

LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

image

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.

Similar News

News February 6, 2026

వడ్డీ రేట్లు యథాతథం

image

కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇవాళ జరిగిన తొలి సమీక్షలో రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. గతేడాది ఈ వడ్డీరేట్లను ఆర్బీఐ పలుమార్లు సవరించిన విషయం తెలిసిందే. దీంతో 2025 FEB-DEC మధ్య రెపో రేటు 1.25 శాతం తగ్గింది.

News February 6, 2026

SACONలో 36 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(SACON)లో 36పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in

News February 6, 2026

‘యుఫోరియా’ సినిమా రివ్యూ&రేటింగ్

image

యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే ఏం జరుగుతుంది? ఆ మత్తులో చేసే అకృత్యాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయనేదే స్టోరీ. భూమిక, సారా నటన, యూత్‌ను ఆలోచింపజేసే అంశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెప్పిస్తుంది. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు గుణశేఖర్ తడబడ్డారు. సెకండాఫ్‌ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్‌గా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయడంతో కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. మ్యూజిక్ ఫర్వాలేదు.
రేటింగ్: 2.25/5