News December 8, 2024

LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. నేటి నుంచి దరఖాస్తులు

image

టెన్త్/ఇంటర్/డిప్లొమాలో 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ <>స్కాలర్‌షిప్ స్కీమ్‌ను<<>> ప్రారంభించింది. 2021-22, 22-23, 23-24లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు. ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్‌కు ఏటా ₹40వేలు, ఇంజినీరింగ్‌కు ₹30వేలు, డిగ్రీ, ITI కోర్సులకు ₹20వేల సాయం అందనుంది.
వెబ్‌సైట్: https://licindia.in/

Similar News

News March 22, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు!

image

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.

News March 22, 2026

అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

image

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News March 22, 2026

అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

image

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.