News April 12, 2024
లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కి సిద్ధం: కేటీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న కేటీఆర్.. లై డిటెక్టర్, నార్కో టెస్ట్‌కైనా సిద్ధమన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్‌ల ఫోన్‌లు ట్యాప్ చేయడం లేదని CM రేవంత్ చెప్పగలరా? ప్రతిపక్షాల ఫోన్‌లను కేంద్రం ట్యాప్ చేస్తోంది. కిషన్ రెడ్డి, రేవంత్‌లకు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకునే ధైర్యం ఉందా’ అని సవాల్ విసిరారు.
Similar News
News March 25, 2026
రామ్ చరణ్‌కు గాయం.. స్పందించిన ‘పెద్ది’ టీమ్

పెద్ది సినిమా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు గాయమైందనే వార్తలపై మేకర్స్ స్పందించారు. ‘సెట్స్‌లో రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయమైంది. చిన్న హెల్త్ ప్రొసీజర్ జరిగింది. ఇప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నారు. రేపు షూటింగ్‌కు హాజరవుతారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు’ అని పెద్ది టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అంతా కంట్రోల్‌లోనే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపింది.
News March 25, 2026
రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ఆఫీసు ప్రారంభం

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఈ ఆఫీసును కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా ఇప్పటివరకు PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.
News March 25, 2026
మిచెల్ స్టార్క్‌కు DC షాక్ ఇవ్వనుందా?

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా IPL ఆరంభ మ్యాచులకు ఢిల్లీ స్టార్ బౌలర్ స్టార్క్ దూరం కానున్నారు. అయితే కొన్నిరోజుల్లో తన రాకపై అప్డేట్ ఇవ్వకపోతే జట్టు నుంచి తప్పించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. స్టార్క్ స్థానంలో మరొక ప్లేయర్‌ను తీసుకోవడానికి సిద్ధమైనట్లు చెప్పాయి. AUS క్రికెట్ బోర్డు NOC ఇవ్వకపోవడంతో స్టార్క్ ఎప్పుడు జట్టులో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేదు.


