News August 23, 2024

కోల్‌కతా వైద్యురాలి కొలీగ్స్‌కు లై డిటెక్టర్ టెస్టులు!

image

ఆర్జీ కర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో CBI వేగం పెంచింది. ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌కు లై డిటెక్టర్ టెస్టులు చేయనుంది. వారిచ్చిన వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది. నేరంతో వారికి సంబంధం లేదని భావిస్తున్నా సాక్ష్యాధారాల చెరిపివేత, కుట్రలో భాగముందా అనే కోణాల్ని CBI పరిశీలిస్తోంది. ఆ రాత్రి జరిగిన పరిణామాల వరుస క్రమంపై అవగాహనకు వచ్చింది.

Similar News

News October 26, 2025

చుండ్రు తగ్గించే హెయిర్ ప్యాక్స్

image

కాలంతో సంబంధం లేకుండ చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. దీనికోసం ఈ ప్యాక్స్. * 3 స్పూన్ల హెన్నా, స్పూన్ ఆలివ్ నూనె, ఎగ్ వైట్‌ కలిపి జుట్టు మొత్తానికి అప్లై చేసి 45 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. * పావు లీటర్ ఆవనూనె వేడి చేసి అందులో గుప్పెడు గోరింటాకు, స్పూన్ మెంతులు వేసి చల్లారాక సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీన్ని తలస్నానం చేసే గంట ముందు రాసుకుంటే ఫలితం ఉంటుంది.

News October 26, 2025

తుఫాను అప్‌డేట్

image

AP: బంగాళాఖాతంలోని వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA అధికారులు చెప్పారు. ప్రస్తుతం కాకినాడకు 880 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.

News October 26, 2025

దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

image

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.