News April 8, 2025
GST వృద్ధి రేటుపై అబద్ధాలు చెప్పారు: హరీశ్ రావు

TG: GST వృద్ధి రేటుపై Dy.CM భట్టి విక్రమార్క ప్రజలకు అబద్ధాలు చెప్పారని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. ‘2024-25FYలో GST వృద్ధి 12.3%అని Dy.CM అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారికంగా 5.1% అని తేలింది. ఇది జాతీయ సగటు (10%) కంటే చాలా తక్కువ. అలాగే 2025 మార్చిలో 0% వృద్ధి నమోదైంది. దీనికి ప్రభుత్వ వైఫల్యం, అస్థిరమైన నిర్ణయాలు, రైతు భరోసా వంటి హామీలు నెరవేర్చకపోవడమే కారణం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 17, 2025
IPL: RR ఓటమి.. ఆ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

నిన్న DCతో మ్యాచులో RR ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 20వ ఓవర్ చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, జురెల్ రెండో రన్ తీయడానికి నిరాకరించారు. ఆ తర్వాత చివరి బంతికి 1 రన్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో DC గెలిచింది. జురెల్ రెండో పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అవ్వకుండా RR గెలిచేదని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News April 17, 2025
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
News April 17, 2025
SRH: హెడ్, అభిషేక్‌లపైనే భారమంతా?

IPLలో భాగంగా ఇవాళ MIతో SRH ఢీకొననుంది. కాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తేనే SRH గెలుస్తోంది. లేదంటే ఆ జట్టు గాడి తప్పుతోంది. గణాంకాలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఇన్నింగ్సులు ఆడారు. ఇందులో గెలిచిన 11 మ్యాచుల్లో 801 రన్స్ కొట్టారు. అదే ఓడిన 10 ఇన్నింగ్సుల్లో 145 పరుగులే చేశారు. గెలిచిన మ్యాచుల్లో జట్టు రన్ రేట్ 14.5 ఉండగా ఓడిన వాటిలో 8.78 మాత్రమే ఉంది.