News March 20, 2024
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్కు జీవితఖైదు

ఎన్కౌంటర్ స్పెషలిస్టు, ముంబై మాజీ పోలీస్ ప్రదీప్ శర్మకు బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. మాఫియా డాన్ చోటారాజన్ అనుచరుడు రామ్నారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా ఫేక్ ఎన్కౌంటర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. చోటా రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, D-కంపెనీ గ్యాంగ్స్టర్ సాదిక్ తదితరులను హతమార్చి ప్రదీప్ గుర్తింపు పొందారు. తాను 112 మంది గ్యాంగ్స్టర్లను హతమార్చినట్లు గతంలో ప్రదీప్ పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
FLASH.. HNKలో సిగ్మా జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన

హనుమకొండలో ఆందోళన నెలకొంది. బట్టుపల్లి వద్ద ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కనిపించకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


