News October 14, 2025
రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

మేషంలా తినాలి. వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి. మిథునంలా కలిసిపోవాలి. కర్కాటకంలా పట్టు విడవకూడదు. సింహంలా పరాక్రమించాలి. కన్యలా సిగ్గుపడాలి. తులలా సమన్యాయం పాటించాలి. వృశ్చికంలా చెడుపై కాటేయాలి. ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి. మకరంలా దృఢంగా పట్టుకోవాలి. కుంభంలా నిండుగా ఉండాలి. మీనంలా సంసార సాగరంలో జీవించాలి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను <<-se_10008>>జ్యోతిషం<<>> కేటగిరీకి వెళ్లి చూడొచ్చు.
Similar News
News October 14, 2025
అరిషడ్వర్గాలను తొలగించే ఆరు నియమాలు

కృష్ణుడికి ఇష్టమైన కార్తీక దామోదర మాసంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మన ప్రేమకు ఆయన బందీ అవుతాడని పండితులు చెబుతున్నారు. ప్రార్థన, మహామంత్ర జపం, దామోదర లీలా పఠనం, సాత్విక నివేదన, దీపారాధన, దామోదరాష్టకం పఠనం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని అంటున్నారు. ఈ 6 నియమాలు పాటిస్తే మనలోని అరిషడ్వర్గాలు తొలగి, శ్రీకృష్ణ కటాక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. ఇల్లు గోకులంగా వెలుగొందుతుందని అంటున్నారు.
News October 14, 2025
E20 వాడకంతో ఆ కార్లలో మైలేజ్ డ్రాప్: సర్వే

20శాతం <<17378231>>ఇథనాల్<<>> కలిపిన పెట్రోల్‌ను వాడుతున్న కార్లలో మైలేజ్ తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 36వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 2022 అంతకుముందు కొన్న కార్లలో ప్రతి 10లో ఎనిమిదింటిలో ఈ ప్రాబ్లమ్ ఉందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమస్య 67శాతంగా ఉండగా ప్రస్తుతం 80శాతానికి పెరిగిందని వివరించింది. అంతేకాకుండా 52% వాహనాదారులు ఇంజిన్, ట్యాంక్ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
News October 14, 2025
సమాన వేతన హక్కు గురించి తెలుసా?

స్త్రీ, పురుషులెవరైనా ఒకే రకం పని చేస్తున్నప్పుడు పొందాల్సిన జీతభత్యాలూ ఇద్దరికీ ఒకేవిధంగా ఉండాలని సమాన వేతన చట్టం-1976 చెబుతోంది. పేమెంట్‌లో వ్యత్యాసం చూపడం చట్టవిరుద్ధం. హైరింగ్, ప్రమోషన్, ట్రైనింగ్‌లో మహిళలపై వివక్షతను తొలగించడానికి ఈ రూల్ తీసుకొచ్చారు. ఒక మహిళ తక్కువ వేతనం అందుతున్నట్లు భావిస్తే, ఆమె ప్రైవేట్/ ప్రభుత్వ రంగం.. ఎందులో పనిచేస్తున్నా చట్టబద్ధంగా సవాలు చేయవచ్చు. <<-se>>#womenlaws<<>>