News October 19, 2024
మార్స్ మంచు కింద జీవం ఉండొచ్చు: నాసా

అంగారకుడిపై మంచు ఫలకాల కింద సూక్ష్మ జీవుల ఉనికి ఉండొచ్చని నాసా అంచనా వేసింది. భూమిపైనా అలాంటి ప్రాంతాలున్నాయని పేర్కొంది. ‘మంచు ఫలకాల కింద ఉన్న నీటికి సూర్యరశ్మి తగిలితే ఫోటోసింథసిస్ కారణంగా సూక్ష్మస్థాయిలో జీవం ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్స్‌పై అలాంటి చోట్లే జీవం గురించి అన్వేషించాలి. భూమిపై ఆ ప్రాంతాలను క్రయోకొనైట్ రంధ్రాలుగా పేర్కొంటాం’ అని వివరించింది.
Similar News
News March 14, 2025
హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌కళ్యాణ్ అన్న: లోకేశ్

AP: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కళ్యాణ్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు. రాష్ట్ర ఆర్థిక, సంక్షేమాభివృద్ధిలో జనసేన నిబద్ధత అనిర్వచనీయం. ఆ పార్టీ కృషి అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. దీనికి ‘జనసేన జయకేతనం’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
News March 14, 2025
అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్ నుంచి జైపూర్ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.
News March 14, 2025
OTTలోకి వచ్చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.