News July 17, 2024

ఆల్మట్టి గేట్లు ఎత్తివేత

image

కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాళ్టితో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండనుంది. ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్‌కు నీటిని వదలనున్నారు. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.

Similar News

News January 24, 2026

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

image

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.

News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 24, 2026

భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

image

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.