News August 23, 2024
హేమపై ‘మా’ సస్పెన్షన్ ఎత్తివేత

సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సస్పెన్షన్ ఎత్తివేసింది. అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియాతో మాట్లాడొద్దని ఆమెను ఆదేశించింది. కాగా కొన్నినెలల కిందట బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొని, డ్రగ్స్ తీసుకున్నట్లు అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 5, 2026
IPL హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్స్ ఇవే

నిన్న RRతో మ్యాచ్‌లో 154.2km/h వేగంతో(ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్) బౌలింగ్ చేసి GT యంగ్ బౌలర్ <<19568795>>అశోక్ శర్మ<<>> అదరగొట్టారు. ఐపీఎల్ హిస్టరీలో ఇది పదో వేగవంతమైన బాల్. 157.7km/h వేగంతో షాన్ టైట్ టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఫెర్గూసన్(157.3km/h), ఉమ్రాన్ మాలిక్(157km/h), మయాంక్ యాదవ్(156.7km/h, 155.8km/h), ఆన్రిచ్(156.2km/h, 154.8km/h), డేల్ స్టెయిన్(154.4km/h), రబాడ(154.2km/h) ఉన్నారు.
News April 5, 2026
‘కోల్‌కతా వరకు వస్తాం’.. పాక్ మంత్రి ప్రగల్భాలు

పాకిస్థాన్ ప్రగల్భాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల భారత ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తామని రెచ్చగొట్టే <<19562163>>వ్యాఖ్యలు<<>> చేసిన ఆ దేశ మంత్రి ఖవాజా.. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్‌తో మళ్లీ యుద్ధం వస్తే అది సరిహద్దులకే పరిమితం కాదని.. కోల్‌కతా వరకు వెళతామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల తిప్పలతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు అంత సీన్ లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
News April 5, 2026
‘మైసా’ నుంచి రష్మిక లుక్

రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ముఖం నిండా గాయాలతో సీరియస్‌గా ఉన్న నేషనల్ క్రష్ ఫొటో వైరలవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.


