News February 19, 2025
రాష్ట్రంలో రానున్న 2, 3 రోజుల్లో చిరుజల్లులు

TG: గాలిలో అనిశ్చితి కారణంగా రాబోయే 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
Similar News
News December 3, 2025
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.
News December 3, 2025
నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.
News December 3, 2025
సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి?

సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖశాంతులు, సానుకూల శక్తి కోసం, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ దినాలలో చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ఈ వ్రతం గురించి మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


