News July 29, 2024
రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు: వాతావరణశాఖ

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
News November 3, 2025
గుండెలు పగిలే ఫొటో

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.
News November 3, 2025
బాత్రూమ్లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

బాత్రూమ్లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.


