News October 22, 2025

సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

image

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.

Similar News

News October 22, 2025

కార్తీక మాసంలో శివపూజ.. యముడు కూడా ఏం చేయలేడట

image

కార్తీక మాసంలో శివారాధన విశిష్టమైనది. ఆయనను పూజించే వారికి అపమృత్యు భయాలుండవని నమ్మకం. ఓనాడు శివుడి పరమ భక్తుడైన మార్కండేయుడిని సంహరించడానికి వెళ్లిన యముడిని, శివుడు సంహరించాడు. లోక కళ్యాణం కోసం తిరిగి బతికించి, తన భక్తుల విషయంలో అచిరకాల నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించాడు. ఆనాటి నుంచి శివభక్తులపై యమ పాశాన్ని ప్రయోగించడానికి యముడు వెనుకాడతాడని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేయాలంటారు.

News October 22, 2025

ఇలా చేస్తే మీ గుండె పదికాలాలు పదిలమే: వైద్యులు

image

వరుసగా 40 పుష్-అప్స్ చేయగలిగే వారికి గుండెపోటు ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయని ప్రముఖ డాక్టర్ సుధీర్ తెలిపారు. గుండె ఆరోగ్యం కోసం చేసే ఏరోబిక్ వ్యాయామాలతో పుష్-అప్స్‌కు సంబంధం ఉందని, ఇది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తుందని చెబుతున్నారు. 1,000 మంది పురుషులపై చేసిన JAMA నెట్‌వర్క్ అధ్యయనంలో 40కి పైగా పుష్-అప్స్ చేయలేనివారితో పోల్చితే చేసిన వారికి గుండెపోటు ప్రమాదం 96% తక్కువ అని తేలింది.

News October 22, 2025

7,565 పోస్టులు.. గడువు పొడిగింపు

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తు గడువును SSC ఈ నెల 31 వరకు పొడిగించింది. 18-25 ఏళ్ల వయస్కులు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in/