News October 31, 2024
దీపావళి వేళ ఈ 5 ప్రదేశాల్లో దీపాలు పెట్టండి!
దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.
Similar News
News October 31, 2024
రూ.21కోట్లకు పూరన్ రిటెన్షన్!
నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్‌కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
News October 31, 2024
‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.
News October 31, 2024
థియేటర్‌లో సినిమా చూసిన ముఖ్యమంత్రి
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ థియేటర్‌లో సినిమా చూశారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీని ఆయన ఇవాళ వీక్షించారు. ‘మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని చిత్రంలో బాగా చూపించారు. ఇందులో కార్తికేయన్, సాయిపల్లవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌కు నా హ్యాట్సాఫ్’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూశారు.