News June 1, 2024
లిగ్నోశాట్ ప్రయోగం ఇలా..

కెన్నెడీ స్పేస్ సెంటర్(US) నుంచి SpaceX రాకెట్ ద్వారా చెక్కతో తయారు చేసిన <<13352790>>లిగ్నోశాట్‌ను<<>> ప్రయోగిస్తారు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్తుంది. అక్కడ సైంటిస్టులు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల మధ్య దీని పనితీరును పరీక్షించి డేటాను భూమికి పంపుతారు. ఇది విజయవంతమైతే పర్యావరణ అనుకూల ఉపగ్రహాల తయారీకి మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాజెక్టు అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో గొప్ప ముందడుగు.
Similar News
News February 21, 2026
ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ తీసుకోవచ్చా?

తల్లి, బిడ్డకు ధనుర్వాతం (టెటానస్ ఇన్ఫెక్షన్) రాకుండా నిరోధించడానికి ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీన్ని రెండు డోసులు తీసుకోవాలి. 2/3 నెలలో మొదటి డోస్, ఆ తర్వాత నాలుగు వారాల గ్యాప్‌తో రెండో డోస్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు మూడేళ్లలో TT ఇంజెక్షన్ తీసుకుంటే బూస్టర్ డోస్ సరిపోతుందని చెబుతున్నారు.
News February 21, 2026
మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

AP: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారాన్ని వైద్యారోగ్య శాఖ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదని స్పష్టం చేసింది. అనుమానిత లక్షణాలున్న 54 మందికి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 21, 2026
కందులను నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.


