News January 12, 2025
లక్ష్య సాధనలో ఓటములా.. ఈ మాటలు వినండి!

వివేకానంద జయంతి సందర్భంగా యువతను చైతన్య పరిచేలా ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుందాం. ‘విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు’. మరొకటి ‘ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి. దాని గురించే కలగనంది. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి. మిగతా ఆలోచనలను పక్కనబెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది’.
Similar News
News November 26, 2025
వనపర్తి: TCC పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని బుధవారం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్,ఎంబ్రాయిడరీలో లోయర్, హాయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజును ఈనెల 5 వరకు చెల్లించాలని అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 12 వరకు అలాగే రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


